Telangana CPM Secretary : మొదటిసారి దళితుడికి తెలంగాణ సీపీఎం పగ్గాలు

Telangana CPM Secretary : మొదటిసారి దళితుడికి తెలంగాణ సీపీఎం పగ్గాలు
X

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో సంచలనం జరిగింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శిగా తొలిసారి దళితుడు ఎంపికయ్యాడు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం మహాసభలో తెలంగాణకు కొత్త కార్యదర్శిగా జన్ వెస్లీని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉండగా.. ఆయన స్థానంలో వెస్లీని ఎంపిక చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. డివైఎఫ్ఐలో కీలక పదవులు నిర్వహించారు.కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.

Tags

Next Story