Foreign Delegates : నాగార్జున సాగర్ డ్యామ్ ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు....

X
By - Manikanta |9 July 2025 5:15 PM IST
పలువురు విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్ డ్యామ్ ను సందర్శించారు. 24 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సాగర్ సందర్శనకు విచ్చేశారు. వీరంతా పర్యావరణ పరిరక్షణపై శిక్షణ పొందుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగర్ పర్యటన కు విచ్చేసిన వీరు ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జల వనరుల శాఖ అధికారులు వారికి ప్రాజెక్టు చరిత్రను వివరించారు. సాగర్ జలాశయం, జలవిద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు . కాగా నాగార్జునసాగర్‌కు ఇటీవల విదేశీ సందర్శకుల తాకిడి పెరిగింది. గత రెండు రోజుల క్రితమే శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు సాగర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com