Big Tiger : ఆదిలాబాద్ జిల్లా శివారులో పెద్దపులిని బంధించిన అధికారులు

X
By - Manikanta |30 Sept 2024 11:15 AM IST
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా జానాడ అటవీప్రాంతంలో మ్యాన్ ఈటర్ పెద్దపులిని ఫారెస్ట్ అధికారులు బంధించారు. 15 రోజుల్లో నలుగురు ప్రాణాలను టీ83 పెద్దపులి తీసింది. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకోవాలని అటవీశాఖ మంత్రి ఆదేశించడంతో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జానాడ సమీపంలోని అడవుల్లో డ్రోన్ సాయంతో పెద్దపులిని గుర్తించారు…. ప్రముఖ షూటర్ అజయ్ మత్తుమందు ఇంజక్షన్ షూట్ చేయడంతో పెద్దపులి స్పృహ కోల్పోయింది. వెంటనే పులిని ఫారెస్ట్ అధికారులు బంధించారు. చంద్రాపూర్ టైగర్ కేర్ సెంటర్‌కు పెద్దపులిని తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com