మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా..!

మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా..!
GHMC మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్‌ పోలీసులు జరిమానా వేశారు. కారులో మాస్క్‌ లేకుండా వెళుతున్న ఆయనకీ పోలీసులు రూ. 1000 రూపాయల చలానా వేశారు

GHMC మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్‌ పోలీసులు జరిమానా వేశారు. కారులో మాస్క్‌ లేకుండా వెళుతున్న ఆయనకీ పోలీసులు రూ. 1000 రూపాయల చలానా వేశారు. కర్మాన్‌ఘాట్‌ చౌరస్తా వద్ద సరూర్‌నగర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కారులో ఆయన మాస్కు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు ధరించలేదని మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు ఎస్సై ముకేష్.. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమకి అందరూ సమానమేనని పోలీసులు తీగలకు రూ. 1000 రూపాయల చలానా విధించారు.

Tags

Next Story