Mallareddy : హీరోయిన్ కసిమీదుంది.. మాజీమంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన మల్లారెడ్డి హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట.. ఆమె మాత్రం కసికసిగా ఉందంటూ నోరు పారేసుకున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఈవెంట్‌కి వచ్చిన ప్రేక్షకులంతా పగలపడి మరీ నవ్వారు. ఆ సినిమా హీరో సైతం నవ్వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మల్లారెడ్డి కామెంట్స్ సరికాదంటూ సోషల్ మీడియా వేదికగానూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టసభల్లో ఉండే వ్యక్తులు మహిళల గురించి ఇలా మాట్లాడడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. మల్లారెడ్డి నోరు జారడం కొత్తేమీ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ కసీ కపూర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com