తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు..!

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును పార్టీ అధిష్టానం నియమించింది. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అయిన బక్కని నర్సింహులును.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ రాజీనామా నేపథ్యంలో...నూతన అధ్యక్షుడిగా నర్సింహులును నియమించారు చంద్రబాబు. తనపై నమ్మకం ఉంచి...తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించిన చంద్రబాబుకు.. నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతోపాటు ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు నర్సింహులు.
తెలంగాణా తెలుగుదేశం పార్టీ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన దళిత నేత, మాజీ శాసనసభ్యులు, ఆత్మీయులు శ్రీ బక్కని నరసింహులు గారికి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సారధ్యంలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/gr3eOyu6ui
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com