Azharuddin : మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు

Azharuddin : మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
X

మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. 2020-23 మధ్య కాలంలో HCAలో దాదాపు రూ.3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తొలిసారి సమన్లు అందుకున్న అజహరుద్దీన్ గురువారం ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది.హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags

Next Story