TG : తెలంగాణ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశా : మాజీ ఎంపీ వినోద్ కుమార్

ఓడిపోతే.. కేసీఆర్ తనకు ఉద్యోగం ఇచ్చారని సీఎం రేవంత్ మాట్లాడారని, తెలంగాణ ఉద్యమంలో ఆరంభం నుంచి ఉన్న తన చరిత్ర అందరికీ తెలుసని, పదవుల కోసం ఏనాడు పాకులాడలేదని మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంతా తన గురించి మాట్లాడేదని మండిపడ్డారు. తాను తెలంగాణ కోసం ఎంపీగా రాజీనామా చేసి గెలిచానని, ఢిల్లీలో తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్ తో కలిసి ప్రయత్నించానని తెలిపారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా తన భాద్యతను తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వర్తించానని, తన గురించి సీఎం హేళనగా మాట్లాడినందుకే స్పందిస్తున్నానని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు కేసీఆర్ హయంలో ఉద్యోగాలు ఇవ్వలేదు అనట్టు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినా మేము హంగామా ప్రచారం చేసుకోలేదని, మార్కెటింగ్ లో రేవంత్ ను మించినోడు లేడని వ్యాఖ్యానించారు. మేము ఉద్యోగాలు ఇస్తే నియామక పత్రాలు పోస్టులో వెళ్ళేవని, ఇపుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారని తెలిపారు. మేమిచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోవాలని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 31 ,2024 లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న రేవంత్ ఇపుడు కొరివి దయ్యం అంటున్నారని, రేవంత్ కు ఎన్ని నాలుకలు ఉన్నాయి అని ఎద్దేవా చేశారు. అలాగే లక్షా 62 వేల ఉద్యోగాలు కేసీఆర్ నింపలేదని ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నానని సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com