Formula E Race Case : ఫార్ములా-ఈ రేస్ కేసు.. ముగిసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ విచారణ

ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ మళ్లీ దూకుడు పెంచింది. ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్‌కుమార్ ను మరోసారి విచారించింది. ఈ కేసులో ఏసీబీ బుధవారం ఆయనకు నోటీసులు ఇచ్చి.. గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో అర్వింద్‌కుమార్ విచారణకు హాజరయ్యారు. ఏ2గా ఉన్న ఆయన్ని ఏసీబీ అధికారులు 6 గంటలపాటు ప్రశ్నించారు. కేటీఆర్, బీఎల్‌ఎన్ రెడ్డి స్టేట్ మెంట్ల ఆధారంగా ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. గతంలో అర్వింద్ కుమార్ ను సైతం విచారించినా.. కేటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా మరోసారి ఆయన్ని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో 2023లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. రూల్స్ బ్రేక్ చేయడంతో ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com