TG : ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు

TG : ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు
X

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు.

పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్‌ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వగా.. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొంది చదువుతుంది.

ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారని జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చినందుకు ఇది సాధ్యమైందని తండ్రి రామచంద్రం తెలిపాడు.

కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్‌ చదువుతున్నారని, ప్రత్యేక తెలంగాణ వల్లే ఇది సాధ్యమైందని పిల్లలతో రామచంద్రం, శారద దంపతులు హరీష్ రావును కలిశారు.

నలుగురు ఎంబీబీఎస్‌ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని హరీష్ రావు పిల్లలను అభినందించాడు...

Tags

Next Story