Telangana : ఫ్రీ బస్సు స్కీమ్.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సంబరాలు

Telangana : ఫ్రీ బస్సు స్కీమ్.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సంబరాలు
X

తెలంగాణలో ఫ్రీ బస్సు స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఫ్రీ బస్సు స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలోని అన్ని డిపోలు, బస్టాండ్స్, ఇతర ఆర్టీసీ కార్యాలయాలలో సంబరాలు చేయనుంది.

ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లతోపాటు భద్రతా సిబ్బందికి ప్రభుత్వం సన్మానం చేయనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా ప్రస్తుతం ప్రతిరోజు 30 లక్షల ఉచిత ప్రయాణాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story