Hyderabad : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ .. నేడు సిటీలో ఫ్రీ జర్నీ

Hyderabad : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ .. నేడు సిటీలో ఫ్రీ జర్నీ
X

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 31వ డిసెంబర్ రాత్రి 10 నుండి అర్థరాత్రి 1 వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ & తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శైఖ్ సలాహుద్దీన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవల కోసం కోసం 9177624678 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. 2017 నుండి, మా సంఘం “హమ్ ఆప్కే సాథ్ హై” పబ్లిక్ సర్వీస్ క్యాంపెయిన్ ద్వారా రోడ్డు భద్రత కోసం నిరంతరం పని చేస్తోందని తెలిపారు.

Tags

Next Story