TG : ఉచితంగా కూరగాయలు.. పెద్దపల్లిలో రచ్చ

TG : ఉచితంగా కూరగాయలు.. పెద్దపల్లిలో రచ్చ
X

పెద్దపల్లి జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్‌ లో ఫ్రీ వెజిటబుల్స్ అనే ప్రకటన గందరగోళానికి దారితీసింది. ఉచితంగా అందిస్తున్న కూరగాయల కోసం జనం ఎగబడ్డారు. హోల్‌సేల్‌ కూరగాయలు అమ్మే యాజమాన్యం రిటేయిల్‌గా అమ్మడాన్ని నిరసిస్తూ వినియోగదారులకు రిటైల్‌ కూరగాయల షాపు నిర్వాహకులు ఫ్రీగా కూరగాయలను ఇచ్చారు. దీంతో.. కాయగూరలకోసం జనం ఎగబడ్డారు. మార్కెట్‌ జనాలతో కిక్కిరిసిపోయింది.

హోల్ సేల్ గా అమ్మే వ్యాపారులు రిటైల్‌గా అమ్మకూడదని రెండు నెలలుగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా వ్వవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైల్‌గా అమ్మి తమ పొట్ట కొడుతున్నారని రిటైల్‌ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక వినియోగదారులకు కూరగాయలు ఫ్రీగా పంపిణీ చేసి నిరసన తెలిపారు. దీంతో.. పోలీసులు మోహరించారు. అధికారులు సర్దిచెప్పారు.

Tags

Next Story