MPTC and ZPTC Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం..!

MPTC and ZPTC Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం..!
X

తెలంగాణలో మరో పోరు జరగబోతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఓటర్ల లిస్టు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నవీకరించిన ఓటర్ల లిస్టుతో పాటు.. కొత్తగా ఎవరైనా యాడ్ అయితే వారిని కూడా లిస్టులో చేర్చి వాటన్నింటినీ రిపోర్టు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. దీంతో కలెక్టర్లు, అధికారులు ఓటర్ల లిస్టు తయారు చేసే పనుల్లో పడ్డారు. పరిస్థితులు అనుకూలిస్తే నెల రోజుల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ అది ఎంత వరకు సాధ్యం అనేది ప్రస్తుతానికి తెలియదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు. కానీ అవేవీ చట్టపరంగా సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవోలకు మద్దతు లేదు. ఎందుకంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది అంత ఈజీగా అయ్యేది కాదు. దానికి ఎన్నో రకాల చిక్కులు వస్తాయి. కాబట్టి వాటికి ఉన్న అడ్డంకులు అన్నీ ఇప్పట్లో క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. మరి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసును పక్కన పెట్టి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది ఇక్కడ పెద్ద డౌట్.

ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి. అవన్నీ పాత పద్ధతి ప్రకారమే జరిగాయి. కానీ ఎక్కువ జనరల్ స్థానాలు బీసీలకే కేటాయించాం అని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పుడు కూడా అలాగే ముందుకు వెళ్తే వచ్చే నెలలోపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే జూన్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags

Next Story