Road Accident : ఫ్రెండ్స్ శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

స్నేహితులంతా కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రానికి దర్శనం కోసం వెళ్లారు. దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. మరో పది నిమిషాలైతే వారి గమ్య స్థానానికి చేరు కుంటారు. అయితే ఇంతలోనే విధి వక్రీకరిచింది. అర్ధరాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో పల్లపు రాము అక్కడికక్కడే మృతి చెందగా, క్రిష్ణమూర్తి, సురేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్రిష్ణమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.
మరో 10 నిమిషాలు అయితే ఇంటికి చేరుతామనుకునే లోపు వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పిచెట్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఏదులాపురం గ్రామ పరిధిలోని ఆటోనగర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెం ప్రాంతానికి చెందిన పల్లపు రాము (46), అతని స్నేహితులు కేతం క్రిష్ణమూర్తి (50), బండారి సురేశ్ ముగ్గురు కలిసి ఈనెల 22వ తేదీన కారులో శ్రీశైలం వెళ్లారు. దైవదర్శనం అనంతరం ఆదివారం (23వ తేదీ) సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఏదులాపురం పరిధిలోని ఆటోనగర్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న వాహనంను తప్పించబోయి కారు రోడ్డు పక్కనే ఉన్నచెట్టును ఢీకొంది. దీంతో పల్లపు రాము అక్కడికక్కడే మృతి చెందగా, క్రిష్ణ మూర్తి, సురేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాద సంఘటనలో మృతిచెందిన రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అన్నం శ్రీనివాసరావు బృందం సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. క్రిష్ణమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రమాద సంఘటనపై రాము భార్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ ముష్కరాజు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com