హైదరాబాద్ గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో మోసాలు.. ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఎంత పెద్దదో.. మోసాలు,అక్రమాలలో కూడ అంతే పెద్దది. తరచూ తూనికలు, కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినా దుకాణదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
అధికారుల దాడులు.. తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయా లేక కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు. మార్కెట్ కమిటీ,సంబంధిత అదికారులు, సిబ్బంది అండదండలతోనే తరచు దుకాణదారులు తూనికలు,కొలతలలో మోసాలకు పాలపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ అదికారులు గడ్డిఅన్నారం పంట్ల మార్కెట్‌లో ఆకసిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్‌లో ఉన్న రెండు వేయింగ్ మిషన్లలో లోపాలు ఉన్నాయని..అలాగే మిగతా దుకాణదారుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ కాటాలతో పాటు సాధారణ తూనికల కాటాలలో కూడ మోసాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
వ్యాపారులు చైనా నుంచి కెమికల్స్ తెప్పించి పండ్లను మాగబెడుతున్నట్టు సమాచారం అందడంతో తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తూనికలు,కొలతలలో మోసాలు జరుగుతున్నాయని రైతులు తమకు ఫిర్యాదులు చేశారని అధికారులు అన్నారు. తనిఖీల అనంతరం పలువురు వ్యాపారులపై 18 కేసులు నమోదు చేశామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com