TG : కార్బన్ రహితంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు

సహజ వనరులను రక్షించుకోకోతే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు మానవాళి మనుగడకు అవసరమైనదేనన్నారు.శుక్రవారం బంజారాహిల్స్ లో జరిగిన గ్రిహ పర్యావరణ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువులు, వర్షపు నీటి నాలాలు కబ్జాకు గురికాకుండా అడ్డుకునేందుకే సీఎం రేవంత్ ‘హైడ్రా’ను ఏర్పాటు చేశారన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల వరద నీటి ముంపు సమస్య తలెత్తుతోందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ.. లేటెస్ట్ టెక్నాలజీతో కార్బన్ రహితంగా ఉంటుందన్నారు.ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి టెక్నికల్ హెల్ప్ అందించాలని మహీంద్రా వర్సిటీని కోరామని శ్రీధర్ బాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com