Dil Raju : జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానం: దిల్ రాజు

జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని TGFDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. HICC వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలను ఎంకరేజ్ చేస్తామన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటలతో గద్దర్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.
గద్దర్ అవార్డుల మీద ఇప్పటికే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వీటిపై మున్ముందు మరింతగా వివాదం ఏర్పడేలా ఉంది. అసలు అవార్డుల్ని ఎవరికి ఇస్తారు? ఏ ఏ చిత్రాలకు ఇస్తారు? అన్నదానిపైనా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డుల మీద మున్ముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. ఈ గద్దర్ అవార్డుల్ని ప్రకటించినప్పుడు కేవలం చిరంజీవి లాంటి వారు మాత్రమే ముందుకు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com