Child Trafficking Racket : చిన్నారులను అమ్మే ముఠా గుట్టురటు

సూర్యాపేటలో అంతరాష్ట్ర చెల్డ్ ట్రాఫికింగ్ ముఠా గట్టు రట్టయింది. 13 మందిని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అపరేషన్లో వారి నుంచి 15 నెలల మగ శిశువును గుర్తించారు. శిశువును చైల్డ్ వెల్పేర్ అధికారులకు అప్పగించారు. పిల్లలు లేని తల్లి దండ్రుల ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారం గా మారంది. ఆభం శుభం ఎరుగని చిన్నారులు ను.. ముక్క పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 22 మందిని విక్రయించిన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎగవేస్తున్నారు. అక్కడి మాఫియా ద్వారా ఆ రాష్టాల నుంచి చిన్నారులను రూ. 23 లక్షల తీసుకువస్తూ.. ఇక్కడ ఒక్కో శిశువును రూ. 3 లక్షల నుంచి 7 లక్షల అమ్ముతున్నారు. గత కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరుగుతున్నదందాపై నిఘా వేసిన పోలీసులు.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగి.. సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చిన్నారులను విక్ర యిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్, సూ ర్యాపేట, విజయవాడ వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు కొనుగోలు చేసిన వివరాలను సేకరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com