Bigg Boss Gangavva : చిక్కుల్లో గంగవ్వ.. కేసు నమోదు

Bigg Boss Gangavva : చిక్కుల్లో గంగవ్వ.. కేసు నమోదు
X

మై విలేజ్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జగిత్యాలలో కేసు నమోదయింది. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో ఒక చిలుకను ఉపయోగించడంపై ఫిర్యాదు రావడంతో జగిత్యాల ఎఫ్‌ఆర్‌వో కేసు నమోదు చేశారు.గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా అటవీశాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు. జగిత్యాల ఎఫ్ఆర్‌వో పద్మారావు ఈ కేసు నమోదు చేశారు. గౌతమ్ అనే జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదుదారు పేర్కొన్నట్టు చెప్పారు. కాగా కేసు నేపథ్యంలో యూట్యూబర్ రాజు రూ.25 వేలు జరిమానా కట్టాడని వెల్లడించారు

Tags

Next Story