TG : షవర్మాలో వాడే మయోనైజ్‌పై నిషేధం? .. GHMC మరో సంచలనం

చికెన్, వెజ్ పుడ్ ఐటమ్స్ లో విరివిగా వాడే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇటీవల పలు హోటళ్లలో జరిగిన ఘటనలు, తనిఖీల్లో వెల్లడైన అంశాలను బేస్ చేసుకుని బల్దియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం జరిపిన తనిఖీల్లో లో క్వాలిటీ మయోనైజ్ ను GHMC సిబ్బంది గుర్తించారు. ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ పదార్థాన్ని నిషేధించేందానికి ప్రభుత్వాన్ని కోరింది.
సికింద్రాబాద్ లోని గ్రిల్ హౌజ్ హోటల్‌లో నాసిరకం మయోనైజ్‌ను తిన్నడం వల్ల కొందరు యువకులు ఆసుపత్రిపాలయ్యారు. వారం కిందట ఐదుగురు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అదే హోటల్‌లో షవర్మ తిన్న 20 మందికిపైగా యువకులు 3, 4 రోజులయ్యాక ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. కొంతమందికి రక్త పరీక్షలు చేయగా.. హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ హోటల్‌లోని షవర్మ బాగోలేదని బల్దియాకు ఫిర్యాదులు అందాయి.
మయోనైజ్ ను వేడిచేయరు.. ఉడికించరు.. కాబట్టి.. మయోనైజ్ సరిగా భద్రపరచకపోతే హానికర బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని GHMC కోరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిపిన తనిఖీల్లోనూ నాసిరకం మయోనైజ్‌ను గుర్తించారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌లోని ఓ హోటల్‌లో, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్లపైనా బల్దియాకు వరుస ఫిర్యాదులు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com