తెలంగాణ

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదు : కిషన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదు : కిషన్‌రెడ్డి
X

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. గత ఎన్నికల హామీనే మళ్లీ ప్రకటించారని ఆరోపించారు. కనీసం పేజీలు, ఫొటోలు కూడా మారలేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదన్న కిషన్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు.

హైదరాబాద్‌ విశ్వనగరం చేస్తామని.. విషాద నగరంగా మార్చారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. వరదలతో 40 మంది చనిపోయారని.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అలాంటప్పుడు ఇది విశ్వనగరం ఎలా అవుతుందో చెప్పాలని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు కిషన్‌రెడ్డి.


Next Story

RELATED STORIES