నామినేషన్లు ముగియనుండటంతో వేగం పెంచిన కారు

శుక్రవారంతో గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుండటంతో అధికార టీఆర్‌ఎస్ స్పీడు పెంచింది. ఇప్పటివరకు రెండు విడతల్లో మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధిష్టానం.. శుక్రవారం ఆఖరి జాబితాను విడుదల చేయనుంది. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లకు గానూ... ఇప్పటివరకు 125 మందిని ప్రకటించింది. మిగిలిన 25 మంది అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయనుంది.
ప్రచారానికి గడువు తక్కువ ఉన్న నేపథ్యంలో స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది టీఆర్‌ఎస్. మొదటి విడతలో 105 మందిని, రెండో విడతలో 20 మందిని ప్రకటించిన అధికార పార్టీ.. శుక్రవారం మిగిలిన 25 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముందు నుంచి రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్త పడుతున్న టీఆర్‌ఎస్... బరిలో నిలపాలనుకుంటున్న అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో... చాలా మంది నామినేషన్లు వేశారు. నిన్నటివరకు టీఆర్ఎస్ నుంచి 195 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇక టీఆర్‌ఎస్ తరఫున మిగిలిన 25 స్థానాల్లో పోటీ చేసేందుకు అనేక మంది సిద్ధమయ్యాయి. ఎమ్మేల్యేలు తాము కోరిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని పట్టుపడుతుండటంతో అన్నీ ఆలోచించి కేటాయించాలన్న ఉద్దేశ్యంతో అభ్యర్థులను ప్రకటించలేదని సమాచారం. చర్లపల్లి, హబ్సిగూడ వంటి డివిజన్లలో బరిలోకి దిగేందుకు టీఆర్‌ఎస్ ముఖ్య నేతల సతీమణులను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com