జీహెచ్ఎంసీ ఎన్నికలు : మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులకు ఛాన్స్..

ఇవాళ గ్రేటర్ ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది తేలిపోనుంది. నేటితో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఇక పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను SEC ప్రకటించనుంది. నిన్న నామినేషన్ల పరిశీలన జరిగింది. మొత్తం 18 వందల 93 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా... వాటిలో సక్రమంగాలేని 68 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. బీజేపీ నుంచి 539, టీఆర్‌ఎస్ నుంచి 527, కాంగ్రెస్ నుంచి 348 నామినేషన్లు దాఖలవ్వగా... టీడీపీ నుంచి 202, ఎంఐఎం నుంచి 72, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 613 నామినేషన్లు నమోదయ్యాయి. ఇక సీపీఎం నుంచి 19, సీపీఐ నుంచి 22, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇక రేబల్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాయి ఆయా పార్టీలు. ఇప్పటికే 50కు పైగా డివిజన్లలో టీఆర్ఎస్ రెబల్స్ నామినేషన్లు వేయగా ఎమ్మెల్యేల సంప్రదింపులతో చాలా మంది ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తారన్న వ్యక్తులను మాత్రం మంత్రులు బుజ్జగిస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల దాదాపుగా రెబల్స్ మెత్తబడి పోటీ నుంచి తప్పుకొంటున్నారని తెలుస్తోంది. ఇటు బీజేపీ కూడా పలువురి రెబల్స్‌తో మంతనాలు జరుపుతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గ ఎన్నికల పోలింగ్‌కు మరో 9 రోజులు మాత్రమే సమయముండటంతో పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించడంతో వారు ముందుగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. రోజుకు అయిదారు రోడ్‌షోలతో కేటీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com