GHMC : జీహెచ్ఎంసీలో 'పవర్' అంబులెన్స్ లు

పవర్ కట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేం దుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనా లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ స్పెషల్ సర్వీసెస్్వహికిల్స్ లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరు ద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంబులెన్స్ తరహాలో సీబీడీ (సెంట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్ లలో ప్రత్యేక వాహనాలను అందు బాటులోకి తీసుకు వస్తున్నామని.. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నా రు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తు తం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉన్నాయన్నారు. ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నామన్నారు. రో జురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నామన్నారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారన్నా రు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరి యల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటా రన్నారు. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయని తెలిపారు. ఈ వాహనాలు ట్రాన్స్ ఫార్మర్ల సామ ర్థ్యాన్ని కలిగి ఉంటాయని.. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. టీజీఏఐఎంఎస్యాప్వారా సిబ్బంది అవస రమైన ప్రదేశానికి వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వాహ నాలను పవర్ అంబులెన్సులు అని పిలవొచ్చు నని,, ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీలను సరిదిద్దడా నికి సహాయపడతాయని చెప్పారు. తద్వారా వినియోగదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com