TG : హిమాయత్ సాగర్ లో భారీ కొండచిలువ

TG : హిమాయత్ సాగర్ లో భారీ కొండచిలువ
X

హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుక్కుని కొండ చిలువ నరక యాతన అనుభవించింది. కొండ చిలువను గుర్తించిన జల మండలి సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. క్రస్ట్ గేటు వద్ద ఇరుక్కున్న కొండ చిలువను స్నేక్ సొసైటీ సభ్యులు కాపాడిారు. ధైర్యంగా క్రస్ట్ గేటు వద్దకు దిగి.. పాము నోటిని పట్టుకొని తాడు సహాయంతో భారీ కొండ చిలువను మీదకు తీసుకువచ్చారు. అనంతరం కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి కొండ చిలువ కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

Tags

Next Story