Dengue : డెంగ్యూతో బాలిక మృతి .. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం

Dengue : డెంగ్యూతో బాలిక మృతి .. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం

డెంగ్యూతో బాలిక మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో జరిగింది. గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య(12) ఓ స్కూల్ లో 5వ తరగతి చదువుతోంది. శ్రీనిత్య తండ్రి ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయాడు. చిన్నారికి వారం రోజులుగా జ్వరం వస్తుండగా.. రెండ్రోజుల కిందట తీవ్రం కావడంతో తల్లి సునీత హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించింది. అక్కడి డాక్టర్లు శ్​రీనిత్యకు డెంగ్యూ వచ్చినట్లు నిర్ధారించారు. ట్రీట్ మెంట్ అందిస్తుండగా.. మంగళవార బాలిక చనిపోయినట్లు ఆమె తల్లి సునీత తెలిపింది.

Tags

Next Story