Harish Rao : కాళేశ్వరం రిపోర్టు ఇవ్వండి... సీఎస్ ను కలిసిన హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకల పై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ... ఇటీవలే తన 665 పేజీల నివేదిక ను ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్ ఆమోదించగా ... రాష్ట్ర అసెంబ్లీ లో దీనిపై చర్చిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రతులను తమకు అందజేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ ను కలిసిన ఆయన.. తనతో పాటు, మాజీ సీఎం కేసీఆర్ తరఫున రెండు వినతిపత్రాలను సీఎస్ కు అందజేశారు. కాళేశ్వరం కమిషన్ తమను విచారించిన నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియజేయాలని హరీశ్ రావు కోరారు. కాగా స్వయంగా హరీష్ రావే సిఎస్ ను కలిసి కమిషన్ రిపోర్టు ఇవ్వాలని కోరడం ఆసక్తిగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com