Yadagirigutta: స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

Yadagirigutta: స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
X

తెలంగాణలో ప్రసిద్ధ ఆలయమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వానమామలై మఠం 31వ పిఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ .. అంగరంగ వైభవంగా జరిగింది. పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యం, 68 కిలోల బంగారం, దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో తీర్చిదిద్దిన ఈ గోపురం దేశంలోనే ఎత్తయిన బంగారు విమాన గోపురంగా రికార్డుకెక్కిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు ప్రకటించారు.

Tags

Next Story