Gold Prices : భగ్గు మంటోన్న పసిడి... తులం బంగారం .. రూ. 1,01,547

హైదరాబాద్: బంగారం ధర భగ్గు మంటోంది. పాత జోకు (11.664 గ్రాములు@12 మాసాలు) తులం ధర లక్ష రూపాయలు దాటింది. రెండు నెలలుగా.. వరుసగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం కాస్త బ్రేక్ ఇచ్చాయి. కానీ ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ గోల్డ్ పై రూ. 390 పెరగడంతో.. 10 గ్రాముల బంగారం 87,060కు చేరుకుంది. దీంతో చరిత్రలో మొదటిసారి బంగారం 87 వేల మార్కును తాకింది. పాత జోకు తులం ధర 101,547 పలుకుతోంది. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,07,000గా ఉంది. ఈ క్రమంలో పేదలు బంగారా నికి ఎప్పుడో దూరమయ్యారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు కూడా బంగారం కొనుగోలుకు దూరమవుతున్నారు. ఈ పెరుగుదలపై మాఘమాసం ఎఫెక్ట్ కూడా ఉందని వ్యాపారలు చెబుతు న్నారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా తోడవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com