Hyderabad Metro : గుడ్ న్యూస్.. మెట్రో చార్జీలపై 10% డిస్కౌంట్

Hyderabad Metro : గుడ్ న్యూస్.. మెట్రో చార్జీలపై 10% డిస్కౌంట్
X

పెంచిన మెట్రో చార్జీలపై 10% రాయితీ ఇస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ మే 24 నుంచి మూడు మెట్రో కారిడార్లలో అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం నగరంలోని లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. మే 17 నుంచి అమలు లోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల పెంపు గురించి ప్రయాణికుల నుంచి విస్తృ తమైన వ్యతిరేకత వ్యక్తమైంది. కనీస ఛార్జి రూ.10 నుంచి రూ. 12కి, గరిష్ఠ చార్జీ రూ.60 నుంచి రూ.75కి పెంచడంతో రోజువారీ ప్ర యాణికులపై ఆర్థిక భారం పడింది. ఈ నేప థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రజా వ్యతిరేకత ను దృష్టిలో ఉంచుకుని మెట్రో సంస్థ ఛార్జీలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో కనీస మెట్రో ఛార్జీ రూ.12 నుంచి రూ.10. 80కి, గరిష్ఠ ఛార్జీ రూ.75 నుంచి రూ.67.50కి తగ్గనుంది.

ఇటీవ‌ల పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..

మొద‌టి 2 కి.మీ. వ‌ర‌కు రూ. 12

2 నుంచి 4 కి.మీ. వ‌ర‌కు రూ. 18

4 నుంచి 6 కి.మీ. వ‌ర‌కు రూ. 30

6 నుంచి 9 కి.మీ. వ‌ర‌కు రూ. 40

9 నుంచి 12 కి.మీ. వ‌ర‌కు రూ. 50

12 నుంచి 15 కి.మీ. వ‌ర‌కు రూ. 55

15 నుంచి 18 కి.మీ. వ‌ర‌కు రూ. 60

18 నుంచి 21 కి.మీ. వ‌ర‌కు రూ. 66

21 నుంచి 24 కి.మీ. వ‌ర‌కు రూ. 70

24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75

Tags

Next Story