TG : బోనస్ పై రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణ కర్షకులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వరి ధాన్యం బోనస్ చెల్లింపు డబ్బులు ఒకట్రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రాష్ట్రంలో సన్నాల సాగును ప్రోత్సహించేందుకు బోనస్ ప్రకటించించిది. సన్న వరికి ప్రతి క్వింటాకు రూ.500 ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు వడ్లకు, సన్నాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీజన్‌లో అన్నదాతలు పెద్ద ఎత్తున సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం వడ్లు 23 లక్షల 58 వేల 344 ఎకరాల్లో సాగు చేయగా.. సన్నాలు 36 లక్షల 80 వేల 425 ఎకరాల్లో సాగు చేశారు. సన్న వరి ధాన్యం 48.91 లక్షల టన్నులు, దొడ్డు రకం వరి ధాన్యం 42.37 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎక్కువగా సన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. సన్న వరి ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ రూ.500 రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి క్వింటాకు రూ.500 చొప్పున మెుత్తం 48.91 లక్షల టన్నులకు రూ.2,445 కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com