Gruha Jyothi : గుడ్ న్యూస్.. గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోండి

గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. మండలిలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. గృహాజ్యోతి స్కీమ్ కు అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని, దరఖాస్తు చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు భట్టి. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గృహాజ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని, గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అన్నీ పరిశీలించి, త్వరలోనే అర్హులను గుర్తిస్తామని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com