Telangana Government : రేషన్ కార్డు దరఖాస్తు దారులకు శుభవార్త

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డులపై శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయ నున్నట్లు ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం.. హైద రాబాద్- 285, వికారాబాద్ జిల్లా- 22 వేలు, నాగర్ కర్నూల్ జిల్లా 15 వేలు, నారాయణపేట జిల్లా- 12 వేలు, వనపర్తి జిల్లా-6 వేలు, మహబూబ్ నగర్ జిల్లా- 13 వేలు, గద్వాల్ జిల్లా- 13 వేలు, మేడ్చల్ మల్కాజి గిరి జిల్లా - 6 వేలు, రంగారెడ్డి జిల్లా - 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టను న్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com