Minister Seethakka : బడి పిల్లలకు మంత్రి సీతక్క శుభవార్త

Minister Seethakka : బడి పిల్లలకు మంత్రి సీతక్క శుభవార్త
X

స్కూల్ విద్యార్థులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు మరో జత యూనిఫాంలు సిద్దం చేసి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మంత్రి సీతక్క రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వచ్చదనం, పచ్చదనం సక్సెస్ చేసిన అందరికి అభినందనలు తెలిపారు.

జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్య కార్మీకుల వరకు బాగా కష్టపడ్డారని అన్నారు సీతక్క. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని ఆగస్టు 15న సన్మానిస్తామని అన్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని, కాని మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం - పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు. పాములతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్ని అన్నారు. క్లీనింగ్ మీద దృష్టి సారించండి, పారిశుద్య లోపాలపై వార్తలు వస్తే సరిదిద్దండని తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, జీపీ స్పెషల్ అధికారులు ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీతక్క. మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story