Telangana : తెలంగాణకు చల్లని కబురు..ఐదురోజుల్లో వానలు

Telangana : తెలంగాణకు చల్లని కబురు..ఐదురోజుల్లో వానలు
X

తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 36-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story