Goods Train : మహబూబ్ నగర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్

మహబూబ్‌నగర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి తమిళనాడుకు సరుకుతో వెళుతున్న గూడ్స్ రైలు బోయపల్లి గేట్ వద్దకు రాగానే దాని 6వ నెంబరు బోగీ పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై రైలును ఆపేశారు. అప్పటికే 20 మీటర్ల దూరం వరకు సిమెంట్ స్లీపర్ల మీదుగా ప్రయాణించడంతో ట్రాక్‌ను దెబ్బతిన్నంది.
ఈ ప్రమాదంతో మహబూబ్‌నగర్-కర్నూలు మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. సుమారు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. చెంగల్‌పట్టు, హంద్రీ, మైసూర్, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లతో సహా పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరమ్మతుల కోసం కాచిగూడ నుంచి ప్రత్యేకంగా యాక్షన్ రిలీఫ్ ట్రైన్‌ను రప్పించి.. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com