Padma Shri Awardees : పద్మశ్రీ గ్రహీతలకు 25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీయం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ.. జీవో జారీ చేశామని పేర్కొన్నారు. పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని సీయం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖతాల్లో జమ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com