Anganwadi : అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

అంగన్వాడి కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా దసరా సెలవులు ఇవ్వడం విశేషమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు. వారి విజ్ఞప్తి మేరకు 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం. తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com