TG : టెన్త్​ ఇంటర్నల్‌ మార్కుల రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

TG : టెన్త్​ ఇంటర్నల్‌ మార్కుల రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
X

పదోతరగతిలో ఇంటర్నల్‌ మార్కుల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్‌ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-–25 విద్యాసంవత్సరానికి నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్ష జరగితే.. 20 మార్కులు ఇంటర్నల్‌ కోసం కేటాయించేవారు. అయితే సర్కార్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు జరుగుతాయని అంతా అనుకున్నారు. అంతలోపే సర్కారు మళ్లీ వెనక్కి తగ్గడంతో ఈ విద్యా సంవత్సరం కూడా ఎప్పటిలాగే ఇంటర్నల్​ మార్కులు ఉంటాయనేది స్పష్టమైంది.

Tags

Next Story