TG : టెన్త్ మార్కులపై సర్కారు యూటర్న్

TG : టెన్త్ మార్కులపై సర్కారు యూటర్న్
X

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. పదోతరగతిలో ఇంటర్నల్‌ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్‌ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల అంటే నవంబర్ 28న తీసుకున్న నిర్ణయాన్ని 29న వెనక్కి తీసుకుంది. ఈ కొత్త విధానంపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఏకంగా 3 నెలల 10 రోజులకు దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 80 మార్కులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌- ఎస్‌ఏ-1 పరీక్షలు పూర్తికావటంతో.. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రకటించటం ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని.. విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది

Tags

Next Story