ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ తమిళిసై

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు.ఆస్పత్రిలో అన్ని వార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పరిస్థితులను ఉస్మానియా వైద్యులు గవర్నర్‌కు వివరించారు.అడ్మిషన్లు, ఓపీ, ఆపరేషన్లు జరుగుతున్న తీరుపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని ఇటీవలే ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు.ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఆస్పత్రి దుస్థితిని ట్వీట్ చేస్తూ పోస్టు పెట్టగా. దీనిపై గవర్నర్ స్పందించారు. ఉస్మానియా దుస్థితి బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా ఆస్పత్రిని పరిశీలించేందుకు గవర్నర్ రావడం చర్చనీయంశంగా మారింది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అటు ఉస్మానియా ఆస్పత్రిని గవర్నర్ తమిళిసై సందర్శిస్తుంటే ఉస్మానియా వైద్యులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు.ఓ వైపు హరీష్‌రావు రివ్యూ జరుగుతుండగానే గవర్నర్ తమిళిసై సడెన్‌గా ఆస్పత్రిని విజిట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇటు హరీష్‌రావు సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు, హెల్త్ సెక్రటరీ, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా అధికారులంతా పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com