TG : 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు

TG : 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
X

డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం అందరూ సహకరించాలని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ఇక్కడ రాష్ట్ర స్థాయి కమిటీ, జీహెచ్ఎంసీ అధికా రులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. బిషప్స్, ఫాదర్స్ ను క్రిస్మస్ విందు వేడుకకు మర్యాదపూర్వకంగా తీసుకొని రావాలని కోరారు. పోలీస్ బందోబస్తు పగడ్బందీగా ఉండాలని, వాహనాల పార్కింగ్ కోసం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story