గ్రేటర్ ఎన్నికలు : ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద

గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టికెట్టు ఆశించి భంగపడ్డ పలువురు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అన్ని పార్టీల్లోనూ రెబల్స్ పోటీ చేశారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రెబల్స్ సెగ తాకింది. టికెట్లు దక్కనివారు పలు డివిజన్లలో రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. అయితే... నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ఈ పార్టీల నేతలు రెబల్స్‌ను బుజ్జగించే యత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రెబెల్స్‌గా నామినేషన్ల వేసిన వారిని... బుజ్జగించి.. నామినేషన్లను ఉపసంహింపచేస్తున్నారు. అయితే.. ఆదివారం సాయంత్రానికి ఎంతమంది బరిలో నిలుస్తారనేది తేలనుంది.
చర్లపల్లి డివిజన్ టికెట్టును ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవికి టీఆర్‌ఎస్ కేటాయించడంతో.. ఆ డివిజన్‌ను నుంచి నెమురీ మహేష్‌గౌడ్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇదే డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి బిజ్జ అభినయ్‌గౌడ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. ఇక నాంపల్లి రెడ్‌హిల్స్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా యాదమ్మ నామినేషన్ వేశారు. నేరెడ్మెట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కె.శ్రీదేవి, బీజేపీ నుంచి ధనలక్ష్మికి టికెట్లు దక్కలేదు. దీంతో వీరు స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా వి.సర్వసతి బరిలో నిలిచారు. జగద్గిరిగుట్టలో టీఆర్‌ఎస్ నుంచి ఏకంగా ఆరుగురు రెబెల్స్‌గా పోటీకి దిగారు. కృష్ణగౌడ్, బాబుగౌడ్, వేణుయాదవ్, మారయ్య, రుద్ర అశోక్, సాయికుమార్ పోటీలో నిలిచారు. ఇదే డివిజన్‌లో బీజేపీ నుంచి నర్సింహ ముదిరాజ్ రెబెల్‌గా రంగంలోకి దిగారు. మల్లాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ తరఫున నెమలి అనిల్, బీజేపీ నుంచి ఎస్వీ కృష్ణ, టీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
నల్లకుంట డివిజన్‌లో టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా తట్ట మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. తార్నాక డివిజన్‌లో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా అలకుంట సరస్వతి నామినేషన్ వేశారు. అత్తాపూర్, రాజేంద్రనగర్ డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ బెడద తప్పలేదు. ఈ డివిజన్ల నుంచి కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గచ్చిబౌలి డివిజన్ నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన గణేశ్‌ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి రవియాదవ్, కొండాపూర్ డివిజన్ నుంచి అదే పార్టీ తరఫున రవీంద్ర ముదిరాజ్ రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున గచ్చిబౌలి నుంచి స్వామిగౌడ్, మట్ట సురేష్, శేరిలింగంపల్లి నుంచి రాజుశెట్టి, కార్వాన్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున టి.లహరి రెబెల్ అభ్యర్థులుగా పోటీకి దిగారు. హబ్సిగూడ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి అనూష, ప్రణీత, బీజేపీ తరఫున సురేఖ, పద్మ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లువేశారు.
చందానగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున నవతారెడ్డి, కె.నిర్మల, సునీతరెడ్డి రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. మన్సూరాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా రామకోటి నామినేషన్ దాఖలు చేశారు. జీడిమెట్ల డివిజన్ టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా వీరారెడ్డి అనురాధ, ఇదే డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి రెబెల్‌గా సూదుల హైమామతి బరిలో నిలిచారు. చందానగర్ నుంచి బీజేపీ తరఫున కె.సింధు, కె.సరిత, బి.నవతారెడ్డి, హిమాయత్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా శైలజ, మిరాజ్ ఫాతిమా పోటీలో నిలిచారు. నాగోలు డివిజన్ నుంచి బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా కందికంటి కన్నాగౌడ్ నామినేషన్ వేశారు. 0రామంతాపూర్ డివిజన్‌లో టీడీపీ నుంచి లింగాల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ తరఫున వామిని దర్శనం రెబెల్ అభ్యర్థులుగా పోటీకి దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com