TSPSC : గ్రూప్-1 ఫలితాలు విడుదల

గ్రూప్1 ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. కమిషన్ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. గతేడాది అక్టోబర్లో 563 పోస్టుల భర్తీకి టీ జీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించింది. మొత్తం 21,093 మంది మంది పరీక్షలకు హాజర య్యారు. అభ్యర్థులు సాధించిన మార్కులపై డౌట్స్ ఉంటే 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్కు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించునున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను రిలీజ్ చేయనుంది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. తాజాగా గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించింది. రేపు గ్రూప్ 2, ఈనెల 14న గ్రూప్ 3, ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com