Telangana Congress : నామినేటెడ్ పదవులపై జాప్యం.. కాంగ్రెస్ లో ఆశావహుల ఎదురుచూపు..

Telangana Congress : నామినేటెడ్ పదవులపై జాప్యం.. కాంగ్రెస్ లో ఆశావహుల ఎదురుచూపు..
X

పదేళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది కదా.. ఇంక తమకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశ పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారంతా.. అధిష్టానం దగ్గర అర్జీలు పెడుతూ వస్తున్నారు. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు వదులుకుని.. నామినేటెడ్ పదవులు కావాలన్నారు. ఇంకొందరు పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతూ ఏదో ఒక ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సరైన పదవులు రాలేదు. కొందరికి మాత్రమే వచ్చాయి. ఇంకా చాలా మంది సెకండ్ గ్రేడ్ నాయకులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా జిల్లాల్లోకి వెళ్లినప్పుడు తమకు పదవుల మీద మాట ఇచ్చారు కాబట్టి.. కచ్చితంగా ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ తో పాత వర్సెస్ కొత్త వర్గాల మధ్య పోరు చాలా చోట్ల కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి డామినేషన్ కొన్ని చోట్ల ఉండటంతో.. పాత నాయకులు కొంత అసంతృప్తికి గురవుతున్నారు. తాము పార్టీ కోసం ఇంత కష్టపడితే.. ఇలా తమకు ఛాన్స్ ఇవ్వకుండా కొత్త వారికి ప్రయారిటీ ఇస్తారా అంటూ అడుగుతున్నారంట. అటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తే కనీసం వాటిల్లో అయినా పోటీ చేసేందుకు అవకాశాలు వస్తాయేమో అనుకుంటే.. ఆ ఎన్నికలు రావట్లేదు.

పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సరే ఇంకా ఎలాంటి పదవులు రాకపోవడంపై కొంత పెదవి విరుస్తున్నారంట సీనియర్ నాయకులు. అయితే సీఎం రేవంత్ మాత్రం ఈ ఎన్నికలపై బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఇలా ఎన్నికలు జరగక.. పదవులు రాక అనేక మంది ఎదురు చూపులతోనే కాలం గడిపేస్తున్నారు.

Tags

Next Story