KTR : బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి: కేటీఆర్

KTR : బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి: కేటీఆర్
X

కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ ఏమైనా మాట్లాడే ముందు డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన నివేదికను చదవాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక రంగాల్లో వృద్ధి జరిగిందని తెలిపారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Tags

Next Story