KTR : తెలంగాణలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది: కేటీఆర్

2022-23లో 1,27,594 ఐటీ ఉద్యోగాలు సృష్టించగా, 2023-24లో ఆ సంఖ్య 40,285కు పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. ఇదే టైమ్‌లో ఐటీ ఎగుమతుల విలువ ₹57,706cr నుంచి ₹26,948crకు పడిపోయిందని ట్వీట్ చేశారు. BRS హయాంలో ఐటీ సెక్టార్ మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధికి ఆజ్యం పోసే కీలకమైన ఇంజన్ ఐటీ రంగమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అనేక కొత్త విధానాలు, టీఎస్‌ఐపాస్ సింగిల్ విండో పాలసీ చొరవ కారణంగా ఐటీ రంగం అపూర్వమైన వృద్ధిని సాధించిందన్నారు. ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రెడేషన్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితమైన నిర్వహణ రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ఈ రెండు రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com