Hyderabad : నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ

హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలకు క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, 3 స్టార్ ఆపై హోటల్స్ నిర్వాహకులకు సీపీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31/ జనవరి 1న రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు అనుమతి తప్పనిసరని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రా.10గంటల వరకే డీజే అనుమతిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తప్పనిసరి అన్నారు.
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్వహకులకు సూచించారు. 15 రోజుల ముందే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం నడిపితే రూ.10వేల ఫైన్, 6 నెలలు జైలుశిక్ష విధిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com