Harish Rao : రేవంత్ పాలనా వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం : హరీశ్ రావు

బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణ మని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించా రు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న ని ర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపిం చారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాల లు, కళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజా రుతుండటం శోచనీయమనిరు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరాని లిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించ కుంటే జులై 1 నుంచి అన్ని రకాల ఆహార పదా ర్థాలు, ఇతర సామగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని ఫైర్అయ్యారు. 'మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమా నులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొన్నది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గు చేటు' అని మండిపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com